జేఎన్ యూలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు...ప్రొఫెసర్లు, విద్యార్థులపై దాడి
- యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు ఘోష్ కు గాయాలు
- ముసుగులు ధరించి వర్శిటీ లోకి చొరబడ్డ దుండగులు
- భారీగా మోహరించిన పోలీసులు
యూనివర్శిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు ఐషే ఘోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు తనను తీవ్రంగా గాయపరిచారని ఘోష్ తెలిపాడు. ఈ ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్శిటీ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.