ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చు.. డేవిడ్ వార్నర్ భావోద్వేగ పోస్టు

  • ఆస్ట్రేలియాను భయపెడుతున్న దావానలం
  • తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానన్న క్రికెటర్
  • వారే అసలైన హీరోలంటూ అగ్నిమాపక సిబ్బందికి ప్రశంస
ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుపై ఆ దేశపు క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భావోద్వేగ పోస్టు చేశాడు. ఆ దావానలాన్ని చూసి తానింకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నాడు. వార్నర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని కార్చిచ్చును చూస్తున్నాడు. అతడి పక్కన ఓ శునకం కూర్చుని ఉంది. తానిప్పుడే ఈ ఫొటోను చూశానని పేర్కొన్న వార్నర్.. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవించి ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులమో ఎప్పటికీ మర్చిపోలేమని వార్నర్ పేర్కొన్నాడు.

మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, వారికి సహకరిస్తున్న వారికి తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ఉంటాయని వార్నర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. మాటలకందని ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారే అసలైన హీరోలని క్రికెటర్ ప్రశంసించాడు.
Go Back to Shorts
Australia
bushfire
david warner

More Telugu News