బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో దెయ్యాలు... లాలూ పనేనంటున్న నితీశ్!
- గతంలో లాలూ ఉన్న ఇంట్లోనే ఇప్పుడు నితీశ్
- వెళ్లిపోయే ముందు నితీశ్ టార్గెట్ గా ప్రత్యేక పూజలు
- స్వయంగా వెల్లడించిన నితీశ్ కుమార్
తన భవనం విశాలంగా ఉండేదని, ఇంటి వెనుక భాగంలో మట్టికుప్పలు, ఇంటి నలుమూలల్లో కాగితపు కవర్లు కనిపించాయని, తన కోసం కొన్ని దెయ్యాలను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లానని లాలూ స్వయంగానే తనతో అన్నారని నితీశ్ వ్యాఖ్యానించారు. లాలూ తనదైన స్టయిల్ లో ఈ మాటలు అనివుండవచ్చని నితీశ్ చెప్పినా, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు బీహార్ లో చర్చనీయాంశమయ్యాయి.
కాగా, గతంలో లాలూకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాళీమాత ఆలయంలో నితీశ్ ప్రత్యేక పూజలు చేయించారని, ఈ విషయాన్ని తాంత్రికుల నుంచి తెలుసుకున్న లాలూ, పూజల ప్రభావం తనపై పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారని ఆర్జేడీ వైస్ ప్రెసిడెంట్ శివానంద తివారీ వెల్లడించారు. అయితే, లాలూకు ఇటువంటి పూజలు, నమ్మకాలు ఉన్నాయే తప్ప, నితీశ్ కు అటువంటివి ఏమీ లేవని జేడీయూ నేతలు చెబుతున్నారు.