రేపు వైఎస్సార్ ‘ఆరోగ్యశ్రీ’ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం

  • ప.గో.లో ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
  • ‘ఆరోగ్య శ్రీ పథకం’ కింద మొత్తం 1059 వ్యాధులకు సేవలు  
  • ఈ పథకం కింద చేరనున్న మరో 1000 వ్యాధులు 
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్ట్ కు రేపు శ్రీకారం చుట్టనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. కాగా, ఆరోగ్య శ్రీ పథకంలో మొత్తం 1059 వ్యాధులకు సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద సేవలు అందిచేందుకు మరో 1000 వ్యాధులను చేర్చనున్నారు. కాగా, ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా ఆయా వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Go Back to Shorts
West Godavari District
YSR Aarogya Sri
cm
Jagan

More Telugu News