TTD: రమణ దీక్షితులు వివాదాలకు కేంద్రబిందువు: బీజేపీ కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి

వివాదాలకు కేంద్రబిందువైన రమణ దీక్షితులను దొడ్డిదారిన నియమించి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీపై ఎన్నో అసత్య ఆరోపణలు చేసిన ఆయనను తెచ్చి పాలక మండలి గౌరవ ప్రధాన అర్చకుడి పదవిలో నియమించడమేమిటని మండిపడ్డారు.

నాలుగు కుటుంబాలకు చెందిన వారు దేవాలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తుంటే రమణ దీక్షితులకు మాత్రం వ్యక్తిగత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా వ్యవహరించి వివాదాలు రేకెత్తించిన ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది భక్తులకు డైరీలు, క్యాలెండర్లు సకాలంలో అందలేదని విమర్శించారు.

Go Back to Shorts
TTD
ramanadikshilu
BJP
prakashreddy

More Telugu News