టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు
- క్రాంతి కుమార్‌ను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు
- కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగిన నట్టి కుమార్
- విధులకు ఆటంకం కలిగించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నేమోదు
దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలిసిన నట్టి కుమార్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 13 మందితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాదులాటకు దిగారు. తన కుమారుడిని ఎందుకు తీసుకొచ్చారంటూ ఘర్షణకు దిగడమే కాకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని నట్టి కుమార్ కుటుంబ సభ్యులు చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. తమ విధులకు భంగం కలిగించడంతోపాటు పోలీసులను నెట్టినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.