రైలు డోర్ దగ్గర ఫీట్ చేస్తూ, పట్టుతప్పి యువకుడి మృతి... వీడియో తీసిన ఫ్రెండ్!
- ముంబై లోకల్ రైల్ లో ఘటన
- వైరల్ అవుతున్న వీడియో
- ఇటువంటి ఫీట్స్ వద్దన్న రైల్వే శాఖ
ఫీట్స్ చేస్తున్న యువకుడు మరణించాడని, అతని పేరు దిల్షాన్ అని రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 26న ముంబై లోకల్ రైల్ లో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. రైళ్లలో ఇటువంటి స్టంట్స్ కూడదని, చట్ట విరుద్ధమైన ఈ తరహా చర్యలతో ప్రాణాలు కూడా కోల్పోవచ్చని హెచ్చరించింది. యువత ఇటువంటి ఫీట్స్ కు దూరంగా ఉండాలని సూచించింది. రైల్వే శాఖ ట్వీట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.