ముగిసిన శీతాకాల విడిది... ఢిల్లీ పయనమైన రాష్ట్రపతి
ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో కొన్ని రోజుల పాటు విడిది చేయడం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాదు శివారు ప్రాంతం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొన్నిరోజుల పాటు గడిపారు. నిన్న సాయంత్రం తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిదిని ముగించుకున్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.