విజయవాడ బందరు రోడ్డులో ఉద్రిక్తత: రాజధానిని తరలించొద్దంటూ చేపట్టిన ర్యాలీ భగ్నం
- అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, అమరావతి పరిరక్షణ సమితి నేతల మధ్య వాగ్వాదం
- రాజధానిని అమరావతిలోనే కొనసాగించేందుకు సహకరించాలని పోలీసులకు వినతి
రాజధానిని అమరావతిలోనే కొనసాగించేందుకు సహకరించాలని పోలీసులను అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కోరారు. అంతకుముందు అమరావతి పరిరక్షణ సమితి నేతలు విపక్ష నేతలతో భేటీ అయ్యారు. రాజధానిని తరలించవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చారు.