budda vankanna: మీ దొంగ నాటకాలు కట్టి పెట్టండి.. మీ గన్నేరు పప్పుని ఒక మాట మీద ఉండమని చెప్పండి: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
జనాభా లెక్కల కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్థం చేసుకున్నారంటూ  టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'అయ్యా విజయసాయి రెడ్డి.. నీ తెలుగు, ఇంగ్లిష్ పాఠాలు మీ గన్నేరు పప్పుకి నేర్పుకో. అమిత్ షాగారి ముందు వంగి, వంగి దండాలు పెట్టారు. రాజ్యసభ సాక్షిగా ఎన్ఆర్సీ బిల్లుకు ఒప్పుకుని, ఇప్పుడు మీ దొంగ బుద్ధి చూపించారు. రాజ్యసభ సాక్షిగా కేంద్రమే చెప్పింది, ఎన్ఆర్సీకి మొదటి అడుగు, ఎన్పీఆర్ అని' అని ట్వీట్ చేశారు.
 
మీ దొంగ నాటకాలు కట్టి పెట్టండి అంటూ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రతి రోజు మడం తిప్పటం, మాట తప్పటం ఆపి, మీ గన్నేరు పప్పుని ఒక మాట మీద ఉండమని చెప్పండంటూ ఎద్దేవా చేశారు. 'మా ముస్లిం సోదరులు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీ గన్నేరు పప్పు అజ్ఞానం గురించి దేశ స్థాయి దాటి ప్రపంచ స్థాయిలో చర్చించుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
budda vankanna
Vijay Sai Reddy
Telugudesam

More Telugu News