'టీఎస్ 09 ఎఫ్ జే 9999' నంబర్ కోసం రూ. 11.50 లక్షలు!
- ఖైరతాబాద్ లో ఫ్యాన్సీ నంబర్ల వేలం
- రేంజ్ రోవర్ కారు కోసం హెటిరో డ్రగ్స్ భారీ ఆఫర్
- ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ. 23.46 లక్షలు
ప్రముఖ డ్రగ్స్ తయారీ సంస్థ హెటిరో ఈ నంబర్ ను సొంతం చేసుకుంది. తాము ఇటీవల కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ 4.4 డీజిల్ ఎల్బీడబ్ల్యూబీ కోసం ఈ నంబర్ ను తీసుకుంది. ఈ కారు ఖరీదు రూ. 2.96 కోట్లు కావడం గమనార్హం. ఇక 0006 నంబర్ కోసం రూ. 1.53 లక్షలు చెల్లించారు విజయ్ కృష్ణ అనే వాహనదారు. 0009 నంబర్ కోసం ఇంపార్టా అకాడమీ రూ. 1.26 లక్షలు చెల్లించగా, నిన్న ఒక్కరోజులోనే ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ. 23,46,321 లభించినట్టు అధికారులు వెల్లడించారు.