ఎన్నార్సీ బిల్లుకు మేము వ్యతిరేకం: సీఎం జగన్
- డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వ్యాఖ్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- డిప్యూటీ సీఎం నాతో మాట్లాడిన తర్వాతే ఎన్నార్సీపై ప్రకటన చేశారు
మైనారిటీలకు తమ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని ప్రకటించారు. ఎన్నార్సీ బిల్లుకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నానని తెలిపారు. డిప్యూటీ సీఎం తనతో మాట్లాడిన తర్వాతే ఎన్నార్సీపై ప్రకటన చేశారని వెల్లడించారు. కడప రిమ్స్ లో సుమారు రూ.350 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడురకాల అభివృద్ధి కార్యక్రమాల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.