amaravati: అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడి స్కెచ్ ఇదే!: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో ఒకలా ఇప్పుడు మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు.

అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఎంత సాగదీస్తే భూముల విలువలు అంత పెరుగుతాయనేది చంద్రబాబు నాయుడి స్కెచ్ అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా? అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
amaravati
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News