Andhra Pradesh: ఈ కారణంతోనే అమరావతిని ప్రజా రాజధాని అంటున్నారు: గల్లా జయదేవ్

  • ఏపీకి మూడు రాజధానులంటున్న సీఎం!
  • స్పందించిన గల్లా జయదేవ్
  • రాజధాని సులువుగా చేరుకునేలా ఉండాలన్న గల్లా

ఏపీ రాజధాని అంశంపై రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. అమరావతిని చంపొద్దని, అమరావతిని నిర్మించాలని సూచించారు. అమరావతి అన్ని వర్గాలకు ఆదర్శప్రాయమైన రాజధాని అని స్పష్టం చేశారు. రాజధాని అన్నది అన్ని ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునేందుకు అనువైనదిగా ఉండాలని, ఈ విషయంలో ఏపీకి అమరావతి అన్ని విధాలా అనుకూలమైనదని వివరించారు.

"ఏపీకి దక్షిణ ప్రాంతంలో ఉన్న కుప్పం నుంచి వైజాగ్ వెళ్లాలంటే 950 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ కుప్పం నుంచి అమరావతికి 598 కిలోమీటర్లే. ఉత్తరాంధ్రలో చివరన ఉన్న ఇచ్ఛాపురం నుంచి కర్నూలు రావాలంటే 917 కిలోమీటర్లు ప్రయాణించాలి, కానీ ఇచ్ఛాపురం నుంచి అమరావతికి 615 కిలోమీటర్లే. అందుకే అమరావతి ప్రజా రాజధాని అయింది" అని ట్వీట్ చేశారు.

More Telugu News