రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక సిద్ధం.. సీఎంను కలవనున్న కమిటీ
- నివేదిక సమర్పించడానికి సీఎం నివాసం వద్దకు చేరుకున్న కమిటీ
- 13 జిల్లాల్లోని ప్రజా సంఘాలు, రైతుల అభిప్రాయాల సేకరణ
- సీఎం సమక్షంలో నివేదిక అంశాలు వెల్లడయ్యే అవకాశం
తాజాగా జీఎన్ రావు నేతృత్వంలోని జీఎన్ రావు కమిటీ రాజధానిపై అధ్యయనంతో పాటు ప్రజాభిప్రాయం సేకరించి నివేదికను సమర్పించడానికి సీఎం జగన్ నివాసానికి చేరుకుంది. ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.