హింసకు దిగితే.. ఖబడ్దార్.. నష్టం పూడ్చడానికి మీ ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం యోగి
- సీఏఏను నిరసిస్తూ హింసకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు
- ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు
- హింసకు దిగిన వారికి సంబంధించి వీడియోలు తీశాం
లక్నో, సంబల్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి ఆస్తులను వేలంవేసి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. ఈ ఘటనల్లో హింసకు దిగిన వారికి సంబంధించి వీడియోలు తీశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల 8 నుంచి రాష్ట్రంలో ఎలాంటి ప్రదర్శనలు చేయకూడదని నిషేధం విధించామన్నారు. ఎలాంటి ప్రదర్శనలైనప్పటికీ ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం సీఏఏను ఉపయోగించుకుంటున్నాయన్నారు.