పోలీసులు మాపై తప్పుడు కేసులు నమోదు చేశారు: కోర్టులో 'సమత' అత్యాచార నిందితుల ఆరోపణలు

  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం
  • నేరాన్ని అంగీకరించని సమత కేసు నిందితులు 
  • నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి అనుమతించిన కోర్టు
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కలకలం రేపిన 'సమత' హత్యాచారం కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దుంలను కోర్టు విచారించింది. వారు ఈ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.  

నిందితుల తరఫున న్యాయవాది రహీం కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి న్యాయస్థానం అనుమతించింది. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా, లింగాపూర్ మండలం ఎల్లపటార్‌లో సమతపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
samata
Kumaram Bheem Asifabad District
Crime News

More Telugu News