వాదనలు వినేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన 'నిర్భయ' తల్లిదండ్రులు
- నిర్భయ కేసు దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
- ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి అక్షయ్
- శిక్ష అమలుకు మీడియా, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్న న్యాయవాది
ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి అక్షయ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లయింట్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపారు. శిక్ష అమలుకు మీడియా, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. కాగా, వాదనలు వినేందుకు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వచ్చారు.