ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు
Add ap7am to your home Screen

ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు

  • దిశ చట్టాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారు
  • యాక్టు కాపీని పంపిస్తే  అనుసరిస్తామని ఢిల్లీ, ఒడిశా, కేరళ అభ్యర్థించాయి
  • చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. దిశ చట్టం రూపొందించే క్రమంలో అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన ట్వీట్ చేశారు.

'దిశ చట్టాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారు. యాక్టు కాపీని పంపిస్తే తామూ అనుసరిస్తామని ఢిల్లీ, ఒడిశా, కేరళ రాష్ట్రాలు అభ్యర్థించాయి. చట్టం రూపొందించే చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు నాయుడు ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు.  ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు' అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News