పౌరసత్వ సవరణ చట్టంతో ఎలాంటి నష్టం లేదు.. వదంతులు నమ్మొద్దు: ప్రధాని మోదీ విజ్ఞప్తి
- భారతీయులెవరూ ఆందోళన చెందక్కర్లేదు
- శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిది
- స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోం
ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితానికి ఆటంకాలు కలిగించడం సబబు కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం శతాబ్దాల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ చట్టం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన పౌరుడికీ ఈ చట్ట సవరణ ద్వారా ఎలాంటి నష్టం జరగబోదని మరోమారు స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని అన్నారు.