ఊరికి కాపలాగా ఉన్న కొండముచ్చు మృతి.. గ్రామస్థుల కన్నీరు!
- కోతుల బెడద నుంచి కాపాడిన కొండముచ్చు
- అస్వస్థతతో మృతి
- సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
ఇటీవల ఓ కొండముచ్చు అస్వస్థతకు గురైంది. దీంతో దానికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అది మృతి చెందడంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. దానికి సంప్రదాయబద్ధంగా డప్పుచప్పుళ్ల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కోతుల నుంచి తమకు రక్షణగా నిలిచిన కొండముచ్చుకు గుర్తుగా గ్రామంలో దాని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గ్రామస్థులు తెలిపారు.