నేపాల్ లో లోయలోకి దూసుకువెళ్లిన బస్సు :14 మంది దుర్మరణం

  • పలువురికి తీవ్రగాయాలు 
  • ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు 
  • సింధుపాక్ చౌక్ జిల్లాలో ఘటన

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాక్ చౌక్ జిల్లాలోని కాలిన చౌక్ మందిరానికి వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా అందులో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.  డోలాఖా ఖాదీచౌర్ - జిరి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Go Back to Shorts
Road Accident
nepal
bus accident
14 died

More Telugu News