మా ఏరియాలో బిర్యానీ ఎందుకు అమ్ముతున్నావ్? అంటూ చితక్కొట్టారు.. వీడియో వైరల్
- నోయిడాలో ఘటన
- కులం పేరుతో దూషించిన వైనం
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
'అతడిని కులం పేరుతో దూషిస్తూ కొట్టారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాం' అని పోలీసులు తెలిపారు. బిర్యానీ ధరపై వారి మధ్య గొడవ చెలరేగిందని, ఈ నేపథ్యంలో దాడి చేశారని తెలుసుకున్నారు. తనపై దాడి చేస్తోన్న ముగ్గురు వ్యక్తుల నుంచి చివరకు లోకేశ్ తప్పించుకున్నాడు. అయితే, ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిమాణాలుంటాయని అతడిని వారు హెచ్చరించారు. అయినప్పటికీ లోకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.