Amaravathi: అమరావతిపై మరో మెలిక పెట్టిన బొత్స సత్యనారాయణ

షార్ట్స్‌లో చూడండి
అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నిన్నటి పరిస్థితిని బట్టే అమరావతే రాజధాని అని చెప్పానని బొత్స లేటెస్ట్ గా మరో మెలిక పెట్టారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని... కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా కొనసాగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టుపై మళ్లీ టెండరింగ్ కు వెళ్లే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును రెండు ఫేజ్ లుగా చేయాలని నిర్ణయించామని తెలిపారు.
Go Back to Shorts
Amaravathi
Botsa Satyanarayana
YSRCP

More Telugu News