rashmi: అందాల యాంకర్ రష్మీతో సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు

షార్ట్స్‌లో చూడండి
అందాల యాంకర్ రష్మీ గౌతమ్ అనంతపురంలో తళుక్కుమంది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి వెళ్లిన ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి, కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆమెపై పూలు చల్లుతూ మురిసిపోయారు. షాపింగ్ మాల్ లో దీపాన్ని వెలిగించిన రష్మీ అనంతరం కొందరితో సెల్ఫీలకు పోజులిచ్చింది.

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ కొన్ని సినిమాల్లోనూ నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్  కోసం ఆమెను వ్యాపారులు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే వైజాగ్, విజయనగరం వంటి ప్రాంతాల్లోనూ ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది.
Go Back to Shorts
rashmi
Twitter
selfie

More Telugu News