బాలికపై అత్యాచార ఘటనలో దిశ చట్టాన్ని అమలు చేస్తాం: వాసిరెడ్డి పద్మ
- ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు
- ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
- నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలుంటాయని వ్యాఖ్య
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని... ఈ చట్టాన్ని ప్రజల్లోకి మహిళా కమిషన్ తీసుకెళ్తుందని చెప్పారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.