మద్య నిషేధం చేయకపోతే ముఖ్యమంత్రికి ఆడపిల్లల పాపం తగులుతుంది: బీజేపీ నేత డీకే అరుణ
- ముగిసిన మహిళా సంకల్ప దీక్ష
- దశల వారీగా మా ఉద్యమం కొనసాగిస్తాం
- పక్క రాష్ట్రాలను చూసి సీఎం నేర్చుకోవాలి
భర్తలు తాగొచ్చి భార్యలను కొట్టినా.. చంపినా, చిన్నపిల్లలు తాగుడుకు అలవాటు పడినా, దిశ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా మద్య నిషేధం చేయమని అంటే.. ‘ఆడపిల్లల పాపం తగులుతుంది ముఖ్యమంత్రికి’ అని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఏ విధంగా అమలు చేయాలన్నది పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని సూచించారు.