చెప్పినట్లే వీడియో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. మోదీయే క్షమాపణలు చెప్పాలని డిమాండ్

13-12-2019 Fri 13:52
  • ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ  
  • గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన రాహుల్
  • మోదీయే క్షమాపణలు చెప్పాలని డిమాండ్

'రేప్ ఇన్ ఇండియా' అంటూ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ లోక్ సభలో బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు చేసిన రాహుల్.. ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించారని, ఇందుకు సంబంధించిన క్లిప్ ను ట్వీట్ చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆ వీడియోను పోస్ట్ చేశారు.

ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగేలా మోదీ వ్యవహరిస్తున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని, మోదీయే క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.  ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.