ఎన్‌కౌంటర్ స్థలానికి విదేశీ మీడియా

  • ఘటనా స్థలాలను పరిశీలించిన ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతినిధులు
  • ఫొటోలు, వీడియోలు తీసుకున్న బృందం
  • ఎన్‌హెచ్ఆర్సీకి పూర్తి నివేదిక సమర్పించిన శంషాబాద్ పోలీసులు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఎన్‌హెచ్ఆర్సీ తెలంగాణ పోలీసుల నుంచి పూర్తి వివరాలు కోరింది. దీంతో స్పందించిన శంషాబాద్  పోలీసులు దిశపై హత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్‌కౌంటర్ జరిగే వరకు అసలేం జరిగిందన్న దానిపై ఎన్‌హెచ్ఆర్సీ బృందానికి పూర్తి వివరాలు అందజేశారు.

మరోవైపు, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిన్న విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించారు. అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు చెందిన సౌత్ ఏషియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మేన్ ఆధ్వర్యంలో ముగ్గురు పాత్రికేయులు ఘటనా స్థలాలను పరిశీలించారు. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఈ బృందం వీడియోలు, ఫొటోలు తీసుకుంది.
Go Back to Shorts
Disha
Encounter
foreign media
the newyork times

More Telugu News