Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • బాలీవుడ్ కి 'నో' చెప్పిన సమంత 
  • అరకులో రాజమౌళి షూటింగ్ 
  • చిరంజీవి కొత్త సినిమా అప్ డేట్  

  *  బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ ను అందాల కథానాయిక సమంత తాజాగా తిరస్కరించిందట. తెలుగు, తమిళ భాషల్లో ఈ ముద్దుగుమ్మ నటించిన 'యూ టర్న్' చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాయికగా నటించమని సమంతను అడిగినప్పటికీ ఆమె తిరస్కరించిందనీ, దాంతో తాప్సీని ఎంచుకున్నారని సమాచారం.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ అరకులోయలో జరుగుతోంది. ఇందుకోసం హీరో ఎన్టీఆర్ నిన్ననే లొకేషన్ కి చేరుకున్నాడు. త్వరలో రాంచరణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతాడు.
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగును రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభిస్తారు. ఇక ప్రధాన షూటింగును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తారని తెలుస్తోంది.    

More Telugu News