దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్
- సమగ్ర విచారణ జరిపించాలి
- 9 మందిని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
- ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలి
దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, నిందితుల మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్ కౌంటర్ పై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను హైకోర్టు గురువారం చేపట్టనుంది.