ప్రేమించిందన్న కారణంతో కూతుర్ని ముక్కలుగా నరికిన కసాయి తండ్రి
- మృతదేహాన్ని ముక్కలుగా కోసి బ్యాగ్ లో పెట్టి పారేసిన తండ్రి
- బ్యాగ్ పారవేసే క్రమంలో దుర్వాసన రావడంతో ఆటో డ్రైవర్ ఆరా
- అనుమానంతో పోలీసులకు సమాచారమందించిన డ్రైవర్
ఇది నచ్చని తివారీ గత ఆదివారం ప్రిన్సీని చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి బ్యాగ్ లో పెట్టి ఓ ఆటోలో తీసుకుపోయి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో అందులో ఏముందని ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో అరవింద్ అక్కడినుంచి పారిపోయాడు. అనుమానంతో ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి బ్యాగ్ తెరిచి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు చేపట్టి అరవింద్ ను అరెస్టు చేశారు.