దిశ నిందితుల ఎన్ కౌంటర్ బాధాకరం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత
- దిశకు అన్యాయం జరిగింది, బాధపడుతున్నా
- ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేయడమూ బాధాకరమే..
- ఆ నలుగురి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ఆలోచించాలి
ఆలేరులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘దిశ అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. మాకూ బాధ కలిగింది. కేసులో నిందితులైన ఆ నలుగురు పిల్లలను చంపేశారు. అందుకు కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి’ అన్నారు.