కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి గుండూరావు రాజీనామా
- ఇప్పటికే రాజీనామా చేసిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య
- ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ..పదవుల త్యాగం
- 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్
తాజాగా గుండూరావు కూడా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపించినట్లు వెల్లడించారు. ఈ రోజు ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కాయి. మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 12 స్థానాలు గెలిచింది. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నాడు.