దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సిట్ ఏర్పాటు

  • సిట్‌లో ఏడుగురు పోలీసు అధికారులు 
  • రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో పనిచేయనున్న బృందం
  • ఎన్‌కౌంటర్ పిటిషన్‌ను నేడు విచారించనున్న హైకోర్టు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌ భగవత్‌ నేతృత్వం వహించనున్నారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఈ బృందంలో సభ్యులు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నేడు విచారించనుంది.
Go Back to Shorts
High Court
encounter
Disha
SIT

More Telugu News