Pawan Kalyan: మీ కష్టాలు తీరాకే ఈ కొబ్బరి నీళ్లు తాగుతా: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెలగతోడులో రైతులతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేందంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఆయనకు అక్కడి రైతులు ఓ కొబ్బరి బోండాన్ని అందించారు. ఆ కొబ్బరి నీళ్లు తాగాలని సూచించారు.

అయితే, ఆ కొబ్బరి బోండాన్ని తీసుకున్న పవన్ తిరిగి దాన్ని ఇచ్చేశారు. రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అప్పుడే  కొబ్బరి నీళ్లు తాగుతానని ఆయన చెప్పారు. రైతులను సమస్యలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News