లాడ్జి గదిలో అవివాహిత జంట ఉండడం నేరం కాదు.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
- కోయంబత్తూరులోని ఓ గదిలో దొరికిన యువతీయువకులు
- అది నేరమని చట్టం చెప్పలేదన్న కోర్టు
- లాడ్జి సీలు తొలగించాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలు
పెళ్లికాని యువతీయువకులు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని, కాబట్టి అదెలా తప్పవుతుందని ప్రశ్నించింది. సహజీవనాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు ఉండడాన్ని కూడా తప్పుబట్టలేమని, అవి ఉండడంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని స్పష్టం చేసింది. లాడ్జి మూసివేతలో నిబంధనలు పాటించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టర్‌ను ఆదేశించింది.