Disha: దిశ అత్యాచారం జరిగిన చోటును పరిశీలించిన ఎన్ హెచ్ఆర్సీ బృందం

షార్ట్స్‌లో చూడండి
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను తీవ్రంగా పరిగణిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. మొదట మహబూబ్ నగర్ లో దిశ నిందితుల మృతదేహాలను పరిశీలించిన ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు అనంతరం అక్కడి నుంచి చటాన్ పల్లి వచ్చారు.

దిశ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆమెను హత్య చేసిన ప్రాంతాన్ని, దహనం చేసిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ఆపై నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రాంతానికి వెళ్లారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసింది. దర్యాప్తులో భాగంగానే కీలక ప్రదేశాలను పరిశీలిస్తోంది.
Go Back to Shorts
Disha
Encounter
NHRC
New Delhi
Hyderabad

More Telugu News