ఉన్నావో ఘటనపై యూపీ అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగిన అఖిలేశ్ యాదవ్
- ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్య పట్ల నిరసన
- రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు'
- చరిత్రలో ఇది ఒక చీకటి రోజన్న అఖిలేశ్
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అధికమైపోయాయని అఖిలేశ్ ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను వారు కాపాడలేకపోతున్నారని, ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు' నిర్వహిస్తామని ప్రకటించారు.