దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు స్పందనగా రోజంతా టీ ఉచితం!
- నిన్న దిశ నిందితుల ఎన్ కౌంటర్
- విజయవాడలో టీ దుకాణం యజమాని హర్షం
- డబ్బులు తీసుకోకుండా కస్టమర్లకు కాఫీ, టీ సప్లై
ముగ్గురు కుమార్తెలకు తండ్రి అయిన సత్యనారాయణమూర్తిని కూడా దిశ ఉదంతం కదిలించి వేసింది. నిందితులను చంపేస్తే బాగుంటుంది అనుకున్నవారిలో ఆయనా ఒకరు! అందుకే దిశ నిందితులు ఎన్ కౌంటర్ లో హతులయ్యారని తెలిసిన వెంటనే తన స్టాల్ కు వచ్చిన వారందరికీ డబ్బులు తీసుకోకుండానే టీ, కాఫీ సప్లై చేశారు. సత్యనారాయణమూర్తి విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద టీ దుకాణం నడుపుతున్నారు.