అనుకున్న దానికి మించి న్యాయం జరిగింది: నిందితుల ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లిదండ్రులు

  • ఎన్‌కౌంటర్‌పై హర్షం 
  • ఉరిశిక్ష పడుతుందని భావించామన్న దిశ తల్లిదండ్రులు
  • కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్య
నిందితుల ఎన్‌కౌంటర్‌తో తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందని దిశ తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేసిన వారు మాట్లాడుతూ.. నిజానికి నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అయితే, అంతకుమించిన న్యాయం జరిగిందని అన్నారు. కాగా, ఈ తెల్లవారుజామున నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Disha
encounter
Disha parents
shamshabad

More Telugu News