'పోలీసులూ జై..' అన్న నినాదాలతో దద్దరిల్లుతున్న ఎన్ కౌంటర్ ప్రదేశం!

  • విషయం తెలుసుకుని తరలివస్తున్న వేలాది మంది
  • చటాన్ పల్లి వద్ద స్తంభించిన ట్రాఫిక్
  • అదనపు బలగాలను తరలించిన పోలీసులు
పక్కా ప్లాన్ వేసి, దిశపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను సజీవదహనం చేసిన నలుగురు నిందితులూ హతమయ్యారు. ఈ ఉదయం నిద్ర లేవగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినిపించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు.

వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి "పోలీసులూ జై", "జస్టిస్ ఫర్ దిశ", "సజ్జన్నార్ జిందాబాద్" అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జ్ వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించిన అధికారులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు.

 ప్రజలు మాత్రం ఈ ఎన్ కౌంటర్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్షలే పడాలని, అప్పుడే మరొకరు ఇటువంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన కూడా చేయబోరని అంటున్నారు.
Go Back to Shorts
Disha
Encounter
Chatanpalli
Hailing
Police

More Telugu News