యూపీలో దిశ తరహా ఘటన.. యువతిపై అత్యాచారం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
- 70 శాతం గాయాలపాలైన యువతి
- లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆమెపై కొందరు మృగాళ్లు గతంలో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. వారిపై బాధితురాలు కేసు పెట్టడంతో ఆమెపై హత్యాయత్నం చేశారని చెప్పారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.