చిత్తూరు జిల్లాలో ఇంటర్ బాలిక కిడ్నాప్!

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అనుప్రియ అనే బాలిక, కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో సతీశ్ అనే యువకుడు ఆమెను తన కారులో వెంబడించి కిడ్నాప్ కు పాల్పడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో కలకడ పోలీస్ స్టేషన్ లో బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పీలేరు-కడప రోడ్ లోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, గతంలోనూ అనుప్రియను కిడ్నాప్ చేసేందుకు సతీశ్ యత్నించినట్టు బాలిక బంధువుల ద్వారా తెలుస్తోంది.
Go Back to Shorts
Chittoor District
kalakada
girl
kidnap

More Telugu News