Jagan: ఆరు నెలల్లో రూ. 67 వేల కోట్ల నష్టం జరిగింది: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆరు నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఇదే సమయంలో రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు.

కక్ష, వివక్షలే వైసీపీ ప్రభుత్వ అజెండా అని విమర్శించారు. ఓ వైపు మద్య నిషేధం అంటూనే... మరోవైపు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. మహిళా రైతు పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని చెప్పారు. భావ వ్యక్తీకరణపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మంత్రులకు ఒక న్యాయం, సాధారణ పౌరులకు మరో న్యాయమా? అని అడిగారు.
Go Back to Shorts
Jagan
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News