బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించండి: అక్బరుద్దీని ఒవైసీ
- కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరపాలి
- మసీదుకు మరో చోట స్థలం ఇవ్వడం మాకు ఆమోదయోగ్యం కాదు
- డిసెంబర్ 6న శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలి
అయోధ్యలో మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని సూచించారు. ఆ రోజున అందరూ తమ దుకాణాలను తెరిచే ఉంచాలని చెప్పారు.