వెరైటీ టైటిల్ తో నాని కొత్త సినిమా!
- కొత్త చిత్రానికి 'టక్ జగదీష్' అనే టైటిల్
- ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన నాని
- వైరల్ అవుతున్న చిత్రం
ఇక 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ ను కూడా నాని రివీల్ చేశాడు. వెనక్కు తిరిగి తన టక్ ను సర్దుకుంటున్నట్టుగా ఉన్న నాని లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2020 వేసవి సెలవుల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. కాగా, నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన 'నిన్ను కోరి' చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే.