కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ.. మండిపడిన కేటీఆర్!
- ఆర్టీసీలోని మహిళా కార్మికులకు రాత్రి 8 గంటల వరకే విధులన్న కేసీఆర్
- ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా? అన్న రేఖాశర్మ
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్న కేటీఆర్
రేఖాశర్మ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడడం తగదని హితవు పలికారు. తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించాలని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.