Disha: నిన్న రాత్రి మటన్ తో భోంచేసిన దిశ హత్యకేసు నిందితులు!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదు శివార్లలోని షాద్ నగర్ వద్ద జరిగిన వైద్యురాలు (దిశ) హత్య కేసులోని నిందితులు చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితులు నలుగురినీ శనివారం సాయంత్రం చర్లపల్లి జైలుకు తీసుకువచ్చారు. జైల్లో నిన్న (ఆదివారం) వారికి మొదటిరోజు. నిన్న ఉదయం వారికి పులిహోరను జైలు సిబ్బంది అల్పాహారంగా అందించారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆదివారాల్లో మాంసాహారాన్ని అందజేస్తారు. దీంతో, అందరు ఖైదీలతో పాటే ఆ నలుగురూ కూడా నిన్న రాత్రి మటన్ తో భోజనం చేశారు. ఈ వివరాలను జైలు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Disha
Murder

More Telugu News