Visakhapatnam District: షాకిస్తానని చెప్పి.. కళాశాల భవనంపై నుంచి కిందికి దూకి తనువు చాలించిన విద్యార్థి!

  • విశాఖలో చదువుతున్న ఒడిశా విద్యార్థి
  • షాకిస్తానని ముందు రోజు తోటి విద్యార్థులకు చెప్పిన బాలుడు
  • కళాశాల ఐదో అంతస్తు నుంచి దూకిన వైనం
షాకిస్తానంటూ సహచర విద్యార్థులకు చెప్పిన కుర్రాడు అన్నంత పనీ చేశాడు. కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని పర్లాఖేముండి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థి విశాఖపట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐదో అంతస్తులోని గదిలో మరో ఏడుగురితో కలిసి ఉంటున్నాడు.

నిన్న తెల్లవారుజామున వార్డెన్ వచ్చి విద్యార్థులను నిద్రలేపి వెళ్లాడు. మిగతా విద్యార్థులు అందరూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలుడు పైనుంచి కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రేపు షాక్ ఇస్తానని శుక్రవారం తమకు చెప్పాడని, షాక్ అంటే ఏంటో అనుకున్నామని, కానీ ఇంత పని చేస్తాడని అనుకోలేదని తోటి విద్యార్థులు తెలిపారు.
Visakhapatnam District
suicide
student

More Telugu News